పురాతన బావులను పునరుద్ధరించాలి : కలెక్టర్ జితేశ్​వీ పాటిల్

పురాతన బావులను పునరుద్ధరించాలి : కలెక్టర్ జితేశ్​వీ పాటిల్

ఎల్లారెడ్డి,వెలుగు ; ఎల్లారెడ్డిలోని రామాలయం, గోపాలస్వామి మందిరం ఆవరణలో ఉన్న380 ఏండ్ల కిందటి పురాతన బావిని  శుక్రవారం కలెక్టర్ జితేశ్​వీ పాటిల్, ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. పురాతన బావుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్టు కలెక్టర్ చెప్పారు.

ఈ బావిని పునరుద్దరించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఇటువంటి పురాతన నిర్మాణాలు ఇక్కడ ఉండటం అదృష్టమన్నారు. బావిని అద్భుతంగా పునర్నిర్మిస్తామని చెప్పారు.