స్టూడెంట్స్​కు క్వాలిటీ ఫుడ్​ అందించాలి : కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్​​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్టూడెంట్స్​కు అందించే ఫుడ్​ క్వాలిటీగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్​ గురుకులాలు, హాస్టళ్ల అధికారులతో సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. హాస్టళ్లను అధికారులు తరుచూ సందర్శించాలన్నారు. 

స్టోర్​రూమ్​ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్టూడెంట్స్​ప్లేట్లను వర్కర్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చూడాలన్నారు. హాస్టళ్లలోని సమస్యలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను స్పీడప్​చేయాలని చెప్పారు. నవంబర్​ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు అధికారులంతా ప్రతిజ్ఞ చేయాలని సూచించారు.