సమగ్ర కుటుంబ సర్వే వివరాలు సీక్రెట్​గా ఉంచాలి : కలెక్టర్ ​జితేశ్​ వి పాటిల్​

సమగ్ర కుటుంబ సర్వే వివరాలు సీక్రెట్​గా ఉంచాలి : కలెక్టర్ ​జితేశ్​ వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  సమగ్ర కుటుంబ సర్వే వివరాలు సీక్రెట్ గా ఉంచాలని ఆఫీసర్లను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ఆదేశించారు. కలెక్టరేట్​లో పలు శాఖల ఆఫీసర్లకు బుధవారం నిర్వహించిన ఒక్కరోజు శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను సేకరించాలని, ఇంటి యజమాని పేరు, కుటుంబసభ్యులు, రేషన్​ కార్డు, ఆధార్​కార్డు వివరాలు నమోదు చేయాలని సూచించారు. 

పూర్తి చేసిన సర్వే దరఖాస్తు ఫారాలను ఎన్యూమరేటర్​ తనకు నిర్దేశించిన డేటా ఎంట్రీ కేంద్రానికి వెళ్లి అప్​ లోడ్​ చేయించాలని చెప్పారు. అప్​ లోడ్​ చేసే టైంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జడ్పీ సీఈవో చంద్రశేఖర్, సీపీవో సంజీవరావు పాల్గొన్నారు.