- సర్కారు దవాఖానాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
- జిల్లా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గవర్నమెంట్ హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లలో ఎక్కువ మంది పేదలే ఉంటారని, వారికి మెరుగైన వైద్యం అందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ వైద్యాధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మురుగునీరు హాస్పిటల్ఆవరణలో నిల్వ ఉండడం, మురుగునీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడాన్ని చూసి డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
దీనిపై వెంటనే ఆర్ అండ్ బీ అధికారులతో చర్చిస్తానని చెప్పారు. హాస్పిటల్లో వార్డుల్లోకి వెళ్లి డాక్టర్లతో మాట్లాడారు. హాస్పిటల్లో కరెంట్వైరింగ్సక్రమంగా లేదని, ఎర్తింగ్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు ఆయన దృష్టికి తీసుకొవచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ చెప్పారు. వైరల్‌ఫీవర్స్ ప్రబలుతున్నందున హాస్పిటల్లో అందుబాటులో ఉన్న మెడిసిన్స్గురించి ఆరా తీశారు. మెడిసిన్స్ రావడం లేదని, బయటి నుంచి కొనుగోలు చేసేందుకు హాస్పిటల్లో ఫండ్స్ లేవని, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందని కలెక్టర్ కు డాక్టర్లు చెప్పారు.
దీనికి కలెక్టర్ స్పందిస్తూ విష జ్వరాలు విజృంభించకుండా అర్జెంట్‌గా అవసరమైన మందులు ఏం కావాలి, హాస్పిటల్లో ఇంకా కావాల్సిన మెడిసిన్, సౌకర్యాలపై తనకు నివేదిక అందజేయాలని ఆర్ఎంవో డాక్టర్ రమేశ్‌కు సూచించారు. డాక్టర్ల డ్యూటీ వివరాలు కూడా తనకు ఇవ్వాలని చెప్పారు. పేదలు వచ్చే సర్కారు దవాఖానాలపై నమ్మకం పెరిగేలా డాక్టర్లు, సిబ్బంది వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు.