
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎండా కాలంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్జితేశ్వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లా, మండల అభివృద్ధి ప్రణాళిక తయారీపై జిల్లా స్థాయి ఆఫీసర్లు, జిల్లా, మండల ప్రజా పరిషత్అభివృద్ధి అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో 2030 సంవత్సరం నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. మంచినీరు, పరిశుభ్రత, పారిశుధ్యం, ఆకలి,పేదరిక నిర్మూలన, పౌష్టికాహారం, సుస్థిర వ్యవసాయం, నీటి యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పర్మిషన్స్ లేని హాస్పిటళ్లపై చర్యలు
పర్మిషన్స్ లేని హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్పిటళ్ల ముందు భాగంలో అంబులెన్స్‌లు తిరిగేందుకు స్థలం ఉండాలన్నారు. పార్కింగ్ స్థలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు.
మోడల్సోలార్విలేజీల కోసం పోటీ
జిల్లాలో మోడల్సోలార్ విలేజీల కోసం పోటీ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటైన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్ సోలార్ పోటీకి అర్హత కలిగిన గ్రామాలను ఎంపిక చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. 5వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన పదిహేను గ్రామాలను జిల్లాలో గుర్తించామన్నారు. ప్రజలు తమ ఇండ్లపైన సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు