
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆహార భద్రత ప్రమాణాలను పాటించని హోటల్స్, రెస్టారెంట్లు, షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్జితేశ్వి పాటిల్ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాలను అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోటల్స్, రెస్టారెంట్స్, పలు షాపుల యజమానులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
బేకరీలతో పాటు పాలు, వంట నూనె, చికెన్, మాంసం నిల్వలపై తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్‌సెంటర్లు, చాట్బండార్లు, బజ్జీల దుకాణాల్లో పదార్థాలు క్వాలిటీగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఆహార భద్రత నిర్వహణపై అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లలో ఆహార నిల్వలు ఉండే చోట ఎలుకలు, పురుగులు లేకుండా శుభ్రంగా ఉంచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు బాలింతలు, గర్బిణులకు నాణ్యమైన ఫుడ్ అందించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించే వ్యాపారులకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి, నాణ్యత పాటించని వారికి ఫైన్లు వేయాలని సూచించారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
కొత్తగూడెంలోని ఆర్డీఓ ఆఫీస్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేశ్తనిఖీ చేశారు. సీసీ కెమెరా పనితీరును పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
పోషణ్ పక్వాడ వారోత్సవాలు..
జిల్లాలో చేపట్టే పోషణ్పక్వాడ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 22 వరకు పోషణ్ పక్వాడ ప్రోగ్రామ్స్జరుగనున్నాయన్నారు. పోషక లోపంతో బాధపడుతున్న పిల్లలతో పాటు మహిళలను గుర్తించి వారికి అవసరమైన ఫుడ్ అందజేయాలన్నారు. పోషకాహార వంటకాలను ప్రదర్శించాలని
ఆదేశించారు. అనంతరం పోషణ పక్షం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్వర్ణలత లెనినా, డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్, పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.