కామారెడ్డి, వెలుగు: ఓటర్ లిస్ట్‌లో ఏ ఒక్కరి పేరు మిస్ అవ్వొద్దని కలెక్టర్ జితేశ్వీ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం ఓటర్‌లిస్ట్‌లో మార్పులు, చేర్పులపై స్టేట్ఎలక్షన్ఆఫీసర్ వికాస్‌రాజ్ కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం కామారెడ్డి కలెక్టర్ ఆఫీసర్లతో మాట్లాడుతూ.. డిగ్రీ కాలేజీలో అర్హత ఉన్న స్టూడెంట్స్‌ను ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు వచ్చే అప్లికేషన్లను స్వీకరించాలన్నారు. అడిషనల్కలెక్టర్లు మనూచౌదరి, చంద్రమోహన్, ఆర్డీవో రంగనాథ్, ఎలక్షన్‌సెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ప్రాచీన కట్టడాలను పరిరక్షించి, మన చరిత్ర ఆనవాళ్లను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతో ఉందని కలెక్టర్ జితేశ్వీ పాటిల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి లోని పురాతన బావిని సోమవారం కలెక్టర్పరిశీలించారు. బావిని పునరుద్ధరించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల భిక్కనూరులోని సిద్ధిరామేశ్వర ఆలయంలో ఉన్న కోనేరును దాతల సహకారంతో బాగుచేయించినట్లు గుర్తు చేశారు.