భిక్కనూరులోని సిద్ధరామేశ్వర ఆలయాభివృద్ధికి రూ. 2 కోట్లు

భిక్కనూరు,వెలుగు :  భిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర మహాక్షేత్రాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ జితేశ్​వి పాటిల్ ​పేర్కొన్నారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సమీపంలోని కోనేరులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధికి ఇటీవల ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించిందని, త్వరలోనే విడుదల అవుతాయని తెలిపారు. ఆయన తో పాటు ఆలయాభివృద్ధి చైర్మన్​అందె మహేందర్​రెడ్డి, ఎంపీడీవో అనంత్​రావు తదితరులు ఉన్నారు.