కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రజలు అభయహస్తం అప్లికేషన్లను సరిగ్గా నింపేలా చూడాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. గురువారం ఆయన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్‌లో ప్రజాపాలన గ్రామసభను పరిశీలించారు. స్థానికులు, అప్లికేషన్లు స్వీకరిస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్లికేషన్ల వివరాలను రిజిస్టర్లో, ఆన్‌లైన్‌లోనూ ఎంట్రీ చేయాలన్నారు. డేటా ఎంట్రీ కోసం కంప్యూటర్లు, స్టాఫ్‌ను రెడీ చేసుకోవాలని సూచించారు.
ఉత్తనూర్‌లో అడిషనల్ కలెక్టర్ పరిశీలన
సదాశివ్‌నగర్ మండలం ఉత్తునూర్‌లో ప్రజాపాలన గ్రామ సభను గురువారం అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్పరిశీలించారు. అప్లికేషన్ ఫామ్‌లో లబ్ధిదారులు తమకు అవసరమైన వాటికే టిక్ మార్కు చేశారా అని పరిశీలించాలన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ హిమబిందు ఉన్నారు.