రూ.3 వేల 222 కోట్లతో  మానుకోట రుణప్రణాళిక : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కె.శశాంక

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను గురువారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కె.శశాంక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం రుణ లక్ష్యం రూ. 3,222 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయ రుణాలకు రూ.2,627 కోట్లు, సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ.282 కోట్లు, ఇతర ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రూ.313 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. రుణలక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో లీడ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ ఆర్.సత్యనారాయణమూర్తి, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఏడీబీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ రవి, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌రావు, యుబీఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌ ఎం.భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.

హరితహారాన్ని సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి

హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడుతూ హరితహారంలో వివిధ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు కేటాయించిన టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చేరుకోవాలని ఆదేశించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో నర్మద, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ ఈఈ తానేశ్వర్, డీఈవో రామారావు, పీఆర్‌‌‌‌‌‌‌‌ ఈఈ సురేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్‌‌‌‌‌‌‌‌ వ్యాన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు.