నారాయణపేట, వెలుగు: ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. బుధవారం వివిధ పార్టీల లీడర్లతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక పార్టీకి చెందిన ప్రతినిధి గానీ ఏజెంట్ గానీ కంట్రోల్ రూమ్‌లో కూర్చుని ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించవచ్చన్నారు. పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను రిటర్నింగ్ అధికారులకు అందించాలని సూచించారు.
ఎన్నికల ఖర్చుల గురించి సందేహాలు ఉంటే పార్టీల ప్రతినిధులు వ్యయ బృందంతో మాట్లాడవచ్చన్నారు. వాహన కాన్వాసింగ్‌లో ఎన్నికల పాటలు ప్లే అవుతున్నాయని, వాటికి మాన్యువల్‌గా అనుమతి తీసుకోవాలన్నారు. ఎంసీసీ కోడ్ ఉల్లంఘనపై సి విజిల్యాప్లో ఫిర్యాదు చేయవచ్చని, తక్షణం చర్యలు తీసుకోబడుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీ యోగేశ్‌గౌతమ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.