గోదావరిఖని, వెలుగు : రామగుండం ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ జంగాలపల్లిలో నిర్మిస్తున్న డబుల్ ఇండ్లను అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జి కమిషనర్ అరుణశ్రీతో కలిసి పరిశీలించారు. రామగుండంలో మొత్తం 670 డబుల్ ఇండ్ల నిర్మాణం చేపట్టగా, 570 పూర్తయి, పెయింటింగ్ జరుగుతుందన్నారు. మరో 56 ప్లాస్టరింగ్ దశలో ఉన్నాయన్నారు.
అనంతరం కార్పొరేషన్ అభివృద్ధి పనుల పురోగతి, పారిశుధ్య నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. మీటింగ్‌లో మేయర్ అనిల్ కుమార్, ఆఫీసర్లు పాల్గొన్నారు. మంథని, వెలుగు: మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనులకు అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం మంథని ఆర్డీవో ఆఫీస్‌లో అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆయనవెంట ఆర్డీవో వి.హనుమాన్ నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.