జ్యోతినగర్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ, సొసైటీ స్కూళ్ల నిర్వహణపై హెచ్‌ఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సోమవారం రామగుండం ఎన్టీపీసీలో జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈవోలు, నోడల్ ఆఫీసర్లకు ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లను సమర్థంగా నిర్వహించడం హెచ్‌ఎంలతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో డీఈవో డి.మాధవి, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.
.
రైతులకు ఇబ్బందులు కలుగొద్దు
ధర్మారం, వెలుగు: కొనుగోలు సెంటర్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం ధర్మారం మండలం దొంగతుర్తి, వ్యవసాయ మార్కెట్ యార్డు, మల్లాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు సెంటర్లకు రైతులు తెచ్చే వడ్లకు మద్దతు ధర దక్కేలా చూడాలన్నారు. ఆయన వెంట డీఏవో ఆదిరెడ్డి, డీసీవో శ్రీమాల, ఏవో రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లనాయక్ ఉన్నారు.