బల్క్​ మిల్క్​ చిల్లింగ్​ యూనిట్​ పనులు కంప్లీట్​ చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష

బల్క్​ మిల్క్​ చిల్లింగ్​ యూనిట్​ పనులు కంప్లీట్​ చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు : వచ్చే నెల చివరి నాటికి బల్క్  మిల్క్  చిల్లింగ్  యూనిట్​ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ లో బల్క్  మిల్క్ చిల్లింగ్ యూనిట్ల పనులపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు రూట్ల ద్వారా పాలు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

మూడు వేల లీటర్ల పాలను సేకరించి, వాటిని భద్రపరిచేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్  మాయాంక్​ మిత్తల్, డీవీఏహెచ్ వో శ్రీనివాస్, అనిరుధ్ చారి, డిప్యూటీ డైరెక్టర్  కవిత, మేనేజర్  శ్రీనివాస్  పాల్గొన్నారు.

నర్వ : మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​ టెన్త్  ఎగ్జామ్​ సెంటర్​ను​కలెక్టర్​ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్​ను పరిశీలించారు. తహసీల్దార్  ఆఫీస్​లో రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పెండింగ్ లో ఉన్న 75 సర్వే నంబర్​ అప్లికేషన్లను వారం రోజుల్లోగా క్లియర్  చేయాలని సర్వేయర్ ను ఆదేశించారు.

ధరణి పెండింగ్​ అప్లికేషన్ల వివరాలను తహసీల్దార్  మల్లారెడ్డిని అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అలాగే ఎంపీడీవో ఆఫీస్​ను తనిఖీ చేసి  అధికారులు, ఉద్యోగుల మూడు నెలల బయోమెట్రిక్  హాజరును పరిశీలించారు.