గట్టేపల్లిలో అప్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్ల నిర్మాణానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : కలెక్టర్​కోయ శ్రీహర్ష

గట్టేపల్లిలో అప్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్ల నిర్మాణానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : కలెక్టర్​కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ల, గట్టేపల్లి గ్రామ శివారుల్లోని కొత్త ఇసుక రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వెళ్లేందుకు అప్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్ల నిర్మాణానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపాలని కలెక్టర్​కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయా గ్రామాల్లోని కొత్త రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరుకుళ్ల, గట్టేపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్ల వెంబడి మొక్కలు నాటాలన్నారు.

 అనంతరం గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, అంగన్ వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీచర్లకు సూచించారు. అనంతరం తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తనిఖీ చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ గాజుల లక్ష్మి, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, అధికారులు ఉన్నారు. 

ఇసుక డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సుల్తానాబాద్ మండలం కోమండ్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన మరో మూడు ఇసుక డంప్ లను రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి గుర్తించి సీజ్ చేశారు.  ఇసుకను లిఫ్ట్ చేయకుండా స్థానికులు అడ్డుకోవడంతో పోలీసుల బందోబస్తుతో మంగళవారం అధికారులు తహసీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కొద్ది రోజులుగా మానేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించి అక్కడి నుంచి లారీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారు. 

కాగా స్థానిక అవసరాల కోసం ఇన్నాళ్లు ఎమ్మెల్యే సూచనలతో కొంత వెసులుబాటు ఇచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు మళ్లీ రెచ్చిపోతున్నారు. దీంతో అధికారులు మళ్లీ సాండ్​ ట్యాక్స్ విధానం అమలుచేసేందుకు ఆలోచిస్తున్నారు. తాజాగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన  పర్యటనలో ఇదే విషయం అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.