నారాయణపేట, వెలుగు: మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి, అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు తాగునీరందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ‘మిషన్ భగీరథ’ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథ పనులు ఇంకా అక్కడక్కడ పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలని ఆదే శించారు. ట్యాంకులు శుభ్రం చేసి క్లోరినేషన్ వాటర్ అందించాలని సూచించారు.
టీఆర్ఎస్ పాలనపై విసుగెత్తి పోతున్నరు
గద్వాల, వెలుగు: టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగెత్తిపోతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. గట్టు మండల కార్యవర్గ మీటింగ్ ను గురువారం ఆరగిద్ద గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. గల్లి గల్లికీ బెల్ట్ షాపులు పెట్టి ప్రజలను తాగుబోతులుగా మార్చారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో గట్టు మండల అధ్యక్షుడు బలికేర శివారెడ్డి, మధుసూదన్ రావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో రైతులకు ‘యాసంగి’ రైతుబంధు: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
శ్రీరంగాపూర్/వనపర్తి, వెలుగు: గ్రామాల్లోని సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని వ్యవసాయశాఖ మంత్రి సి. నిరంజన్‌రెడ్డి అన్నారు. పల్లెనిద్రలో భాగంగా ఆయన శ్రీరంగాపూర్ మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి చెందుతోందన్నారు. వ్యవసాయ రంగం బలోపేతం చేసేందుకు ఏటా లక్షా50 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. త్వరలో 65 లక్షల మంది రైతులకు యాసంగి రైతు బంధు విడుదల చేస్తామని తెలిపారు.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
ప్రమాదాల్లో చనిపోయిన, అకాల మరణం చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పార్టీ అండగా నిలుస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఎల్లయ్య చనిపోవడంతో మృతదేహానికి నివాళి అర్పించారు.
‘డబుల్’ ఇండ్లను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు: ‘డబుల్’ ఇండ్లను త్వరగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. గద్వాల సమీపంలోని దేవదర్పల్లి దర్గా దగ్గర ‘డబుల్’ ఇండ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్ తో గురువారం ఆయన పరిశీలించారు. 24 వార్డులలో 560 ఇండ్లు కంప్లీ ట్ అయ్యాయని, 30 బ్లాక్ లలో 715 ఇండ్ల పను లు నడుస్తున్నాయని ఆఫీసర్లు వివరించారు. అ నంతరం 300 బెడ్ల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి క్వాలిటీతో కట్టాలని కాంట్రాక్టర్లను, ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం తర్వాత కలెక్టరేట్ మీటింగ్ హాల్లో బ్యాంక్ మేనే జర్లు, జిల్లా ఆఫీసర్లతో పీఎంఈజీ సీ, ముద్ర లోన్లపై కలెక్టర్ మీటింగ్ నిర్వహించారు. రెండు వారాల్లో పెడింగ్ అప్లికేషన్లను పరిశీలించి, లోన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపి అప్లికేషన్లను రిజెక్ట్ చేయొద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో అడిషన ల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, చేనేత శాఖ ఏడీ గోవిందప్ప, వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, డీఆర్డీఓ నాగేంద్రం, పీఆర్‌ఈఈ శివకుమార్ ఉన్నారు.
కవితను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్‌చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి డిమాండ్ చేశారు. గురువారం యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే విధంగా కవిత పాత్ర ఉండడం బాధాకరమన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ బంగారు తెలంగాణ అంటూ కమిషన్ల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి , బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నారాయణ యాదవ్, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో వ్యసాయ రంగం నిర్వీర్యం:బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి
మిడ్జిల్, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, ప్రజల దృష్టి మరల్చడానికి అవసరం లేని చోట కత్తి తిప్పుతున్నాడని బీజేఏపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా కిసాన్ మోర్చ శిక్షణ తరగతులకు గురువారం హాజరై మాట్లాడారు. రైతుబంధును సర్వరోగ నివారిణిలాగా చెప్పుకుంటూ రైతులకు అన్ని సబ్సిడీలు ఆపేశారని, కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు తప్పా.. రైతులకు మేలు చేసే ప్రాజెక్టులు కట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గోవర్ధన్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు.