
నారాయణపేట, వెలుగు: మెడికల్ కాలేజీ పనులను త్వరగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మండలంలోని అప్పక్ పల్లి వద్ద నిర్మిస్తున్న జిల్లా ఆసుపత్రి బిల్డింగ్ పనులను, కాలేజీలో వసతి, సౌలతులను పరిశీలించారు. పనులను ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో కంటి పరీక్షల విభాగం, డెంటల్, జనరల్ ఫిజీషియన్ రూమ్స్, అతిసార వార్డును పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రంజిత్ కుమార్, ఆర్ఎంవో పావని, డాక్టర్లు పాల్గొన్నారు.