మాగనూర్, వెలుగు : వచ్చే ఎన్నికల కోసం బార్డర్ చెక్‌పోస్ట్‌లను పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ ఆఫీసర్లతో కలిసి బుధవారం కృష్ణ మండలం బార్డర్ చెక్ పోస్ట్ లను పరిశీలించారు. పోలీస్, ఆర్టీవో, ఎక్స్‌జ్ అధికారులతో కలిసి చెక్ పోస్ట్ ల ఏర్పాటుకు అవసరమైన సౌలతులు కల్పించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కై స్థలాన్ని పరిశీలించారు. చెక్ పోస్ట్ లో పోలీస్, ఎక్సైజ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఆర్టీవో అధికారుల కోసం ఓ కంటైనర్ ను ఏర్పాటు చేయాలన్నారు.
బార్డర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలక్షన్ల సమయంలో మద్యం, నగదు నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాగనూర్ పీహెచ్‌సీని పరిశీలించారు. డాక్టర్లు, ఏఎన్ఎంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్, ఆర్టీవో వీరస్వామి, ఎక్సైజ్ ఆఫీసర్లు కవిత రెడ్డి, రాజ్యలక్ష్మి, సిఐ రాంలాల్, ఎస్ఐ విజయ భాస్కర్ పాల్గొన్నారు.