నారాయణపేట, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు రూల్స్ పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్హాల్లో ఎన్నికల నిర్వహణ, శిక్షణపై నోడల్ అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హత, అనర్హత, నామినేషన్ నుంచి గుర్తులు కేటాయించేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
డిస్ట్రిక్ట్ ఎలక్షన్ మేనేజ్ మెంట్, పోలింగ్ స్టేషన్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీఎం, సీ, స్వీప్,ఈవీఎం, వీవీ ప్యాట్, ఎలక్షన్ మెటీరియల్ గురించి వివరించారు. అడిషనల్ కలెక్టర్ మాయాంక్ మిత్తల్, ఎస్డీసీ రాజేందర్ గౌడ్, ఆర్డీవో రామచంద్ర, డీపీఆర్వో రశీద్, డీఆర్డీవో గోపాల్ నాయక్, డీఏవో జాన్ సుధాకర్ పాల్గొన్నారు.