నారాయణపేట, వెలుగు: బాల్య వివాహాలను అరికట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు నివారించేందుకు సమష్టిగా పని చేయాలన్నారు. పోక్సో కింద నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి వచ్చిన ఘటనలపై కేసు నమోదు చేయాలన్నారు.
పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కేసులు ఉంటే నోటీసులు ఇచ్చి ఎఫ్ఐఆర్ అందించాలన్నారు. సఖి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కేసులు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. డీడబ్ల్యూవో వేణుగోపాల్, షీ టీం ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.