అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ : కలెక్టర్ ​క్రాంతి

అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ : కలెక్టర్ ​క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ అని కలెక్టర్​క్రాంతి అన్నారు. శనివారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయీ బ్రెయిలీ 216 వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. లూయి బ్రెయిలీ తనకు అంధత్వం వచ్చిందని బాధపడకుండా అంధులు చదువుకోడానికి వీలుగా ప్రత్యేక లిపిని కనుగొన్నారని కొనియాడారు.

బ్రెయిలీ లిపి ఆధారంగా ఎంతోమంది అంధులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. సివిల్ సర్వీసుల్లో ర్యాంకులు సాధించి కలెక్టర్లు అవుతున్నారని గుర్తుచేశారు. జిల్లాలో అంధుల కోసం ప్రత్యేకంగా సౌండ్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు అంధులకు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం బ్లైండ్ స్టిక్స్ ను పంపిణీ చేశారు.  బ్రెయిలీ లిపి క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

దివ్యాంగుల ప్రజావాణికి 14 దరఖాస్తులు

జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రతీ నెల మొదటి శనివారం ప్రత్యేక ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​క్రాంతి తెలిపారు. ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన ప్రజావాణిలో 14 దరఖాస్తులు అందాయని చెప్పారు. వీటిలో పెన్షన్ లు, ఉపకరణాల సమస్యలు ఉన్నాయన్నారు. ఈ నెల 8న జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో కలెక్టర్​ఆఫీసులో దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

కార్యక్రమంలో డీఆర్​వో పద్మజారాణి, జడ్పి సీఈవో జానకి రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​అనిల్ కుమార్, జిల్లా అంధుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్, మహేశ్, జ్ఞానేశ్వర్, విట్టల్, జుబేదా, రాంశెట్టి  పాల్గొన్నారు.

కలెక్టర్​ను కలిసిన ఎమ్మెల్యే

కొత్త ఏడాదిని పురస్కరించుకొని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ క్రాంతిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని, గత ప్రభుత్వంలో మంజూరైన పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు.

 పద్మశాలి ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ 

నారాయణ్ ఖేడ్ : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ ను కలెక్టర్ క్రాంతి,అడిషనల్  కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి శనివారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీస్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షులు జట్ల భాస్కర్, చింత బలరాం, జిల్లా ఆడిట్ అధికారులు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు బొకే అందజేసి శాలువాతో సన్మానించారు.