నాణ్యమైన విద్యను అందించాలి : కలెక్టర్ క్రాంతి

 నాణ్యమైన విద్యను అందించాలి : కలెక్టర్ క్రాంతి
  • కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: స్టూడెంట్స్ కు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శనివారం హత్నూర మండలంలోని తహసీల్దార్ ఆఫీసు,రెసిడెన్షియల్ హాస్టల్, కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉందని స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.  పీహెచ్​సీ తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సంగారెడ్డి, హత్నూరలో నిర్మిస్తున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తొలివిడతగా మంజూరైన ఐటీసీలలో ప్రవేశాలు చేపట్టినందున ఈ భవన నిర్మాణ పనులకు వేగంగా  పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఫరిన్ షేక్, ఎంపీడీవో శంకర్, ఆర్ఐ శ్రీనివాస్, సర్వేయర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.