స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ క్రాంతి  

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ క్రాంతి  

సంగారెడ్డి టౌన్, వెలుగు: స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఆర్ వోలు, ఏఆర్​వోలు, పీవోలు, ఏపీవోలకు మాస్టర్ ట్రైనీలచే శిక్షణ ఇచ్చి పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ ఆఫీసును ముందుగానే ఎంపిక చేసుకుని వివరాలను స్పష్టంగా పొందుపర్చాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు.