స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టాలి : కలెక్టర్ క్రాంతి

స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టాలి : కలెక్టర్ క్రాంతి
  • కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: స్టూడెంట్స్​కు నూతన మెనూ ప్రకారం క్వాలిటీ భోజనం పెట్టాలని కలెక్టర్ క్రాంతి ​సూచించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని శివాజీ నగర్ లో ఉన్న షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని కిచెన్ షెడ్డును, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ లో నిత్యవసర వస్తువులను పరిశీలించారు. అనంతరం స్టూడెంట్స్​తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున చదువుపై దృష్టి  పెట్టాలని సూచించారు. అనంతరం వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. ఆమె వెంట బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, అధికారులు ఉన్నారు. 

 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి 

టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షలు 54 పరీక్ష కేంద్రాల్లో, పదో తరగతి పరీక్షలు 122 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి,  శానిటేషన్ పై దృష్టి పెట్టాలన్నారు. పదో తరగతి పరీక్షలకు 22,423 మంది  స్టూడెంట్స్​హాజరవుతారని తెలిపారు. 

ఇంటర్ ఫస్ట్​ఇయర్​పరీక్షలకు15వేల 984 మంది, ఒకేషనల్ 1681 మొత్తం 17,665 మంది స్టూడెంట్స్​ , సెకండియర్​పరీక్షకు 17,057, ఒకేషనల్ 1431 మొత్తం 18,488 మంది స్టూడెంట్స్​హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ సంజీవ్ రావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్​వో పద్మజా రాణి, డీఈవో వెంకటేశ్వర్లు, ఇంటర్​అధికారి గోవిందరాం, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు