
కొండాపూర్, వెలుగు: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను గురువారం కలెక్టర్క్రాంతి పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహం, కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించి స్టూడెంట్స్తో ముచ్చటించారు.
పదో తరగతిలో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులై జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు, హాస్టల్లో మౌలిక సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట తహసీల్దార్ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.