సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ క్రాంతి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. పదిమంది డాక్టర్లు విధులకు గైర్హజరైనట్లు గుర్తించారు. వారికి షోకాజ్ నోటీసులు జరీ చేయాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఎక్కువ రోజులుగా విధులకు హాజరు గాని వైద్యాధికారులను కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేయాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులకు ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఇన్ పేషెంట్ గా చేరిన వారికి అందిస్తున్న భోజనం, పాలు, బ్రెడ్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన  పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు . అనంతరం ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రాన్ని, దంత విభాగాన్ని పరిశీలించారు. కలెక్టర్​వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్, వైద్యులు, సిబ్బంది  ఉన్నారు.