వివరాలు పక్కాగా నమోదు చేయాలి : కలెక్టర్ క్రాంతి

  • కలెక్టర్ క్రాంతి

పటాన్ చెరు (గుమ్మడిదల), వెలుగు: ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్వే వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్​క్రాంతి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మండలంలోని నల్లవల్లిలో జరుగుతున్న సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలన్నారు.

 సాగుకు యోగ్యమైన భూములను సర్వే నెంబర్ల వారీగా పరిశీలించి నిర్ధారిస్తున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రేషన్​కార్డులను అందజేస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆర్టీవో రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఖిలేశ్ రెడ్డి, తహసీల్దార్ గంగాభవాని, ఎంపీడీవో ఉమాదేవి, ఏవో శ్రీవివాస్. డీటీ కరుణాకర్ రావు. ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.