సంగారెడ్డి టౌన్, వెలుగు: రిపబ్లిక్‌డే వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. రిపబ్లిక్‌డే వేడుకల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖకు సూచించారు. ప్లాస్టిక్ ను నిషేధించాలన్నారు. కార్యక్రమం జరిగే ప్రదేశాల్లో స్వచ్ఛభారత్ కింద శుభ్రత పనులను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
వేదిక వద్దకు వచ్చే మార్గాలను శుభ్రంగా ఉంచడం, తాగునీటి సౌకర్యం కల్పించడం వంటి పనులపై దృష్టి పెట్టాలన్నారు. స్టూడెంట్స్‌తో సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటుచేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల శకటాలను ప్రదర్శించాలన్నారు. రాజకీయ ప్రముఖులు, రిటైర్డ్ఉద్యోగులు, సంఘ సేవకులను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పద్మజారాణి, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.