సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న పేద క్రీడాకారులను వెలికితీయడానికే సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ క్రాంతి అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లా స్థాయిలో 27 మండలాలు, 8 మున్సిపాలిటీల్లోని 1000 మంది క్రాడాకారులు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
స్టూడెంట్స్చదువుతో పాటు తమకు ఇష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలన్నారు. గెలుపుతో పొంగిపోవద్దని, ఓటమితో కుంగిపోవద్దని గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. ట్రైనీ కలెక్టర్ మనోజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జావేద్అలీ, అధికారులు, ప్రజాప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.