పోతిరెడ్డిపల్లి హై స్కూల్​ను తనిఖీ చేసిన కలెక్టర్

పోతిరెడ్డిపల్లి హై స్కూల్​ను తనిఖీ చేసిన కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి హై స్కూల్​ను కలెక్టర్​క్రాంతి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్​ప్రతిభా, సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో కీలకమైనదన్నారు.

స్టూడెంట్స్​ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదువుకునేలా టైం టేబుల్ రూపొందించుకోవాలని సూచించారు. విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను హెచ్ఎంలు స్కూల్ అవసరాలకు ఖర్చు చేయాలని, కొనుగోలు చేసిన సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.