
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్లు, అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ప్రజావాణికి 65 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో ధరణి, ఆసరా పెన్షన్లు, ఇరిగేషన్, భూ సర్వే, గ్రామ పంచాయతి, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయన్నారు.
అధికారులు ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ మాధురి, డీఆర్వో పద్మజారాణి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఎంహెచ్వో గాయత్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు తదితర సమస్యల పై మొత్తం 54 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.
అనంతరం రుణమాఫీ, రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు మా రెడ్డి రామలింగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో అర్జీని అందజేశారు. రైతు సంఘాల నాయకులు రవీందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజేశం, యాదనరావు, సంతోష్ రెడ్డి. మధుసూధనరెడ్డి, లక్ష్మయ్య, వెంకటరామిరెడ్డి, మోహన్ రెడ్డి, భిక్షపతి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
మెదక్: మెదక్కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 95 అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్రాహుల్రాజ్ఆదేశించారు. ప్రతి దరఖాస్తుదారుకు న్యాయం చేయాలనే లక్ష్యంతో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు.