రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్ క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని మందుల నిల్వ గది, రోగుల ఇన్ పేషంట్ వార్డు , ల్యాబ్ తదితర విభాగాలను చెక్చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వైద్యాధికారికి సూచించారు.
అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలోని 112,113 డివిజన్లలో పర్యటించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ అతిథి గృహంలో మొక్కలు నాటారు. శానిటేషన్ ను మెరుగు పర్చాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, తహసీల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, ఆస్పత్రి సూపరింటెండెంట్శ్రీనివాస్, స్థానిక నేతలు అనిల్ కుమార్, యాదవ్, పుష్ప, నగేశ్యాదవ్ పాల్గొన్నారు.