పటాన్చెరు,వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్లో గల సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ ను కలెక్టర్క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో తిరుగుతూ కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, భోజనశాలను పరిశీలించారు. స్టూడెంట్స్తో మాట్లాడి స్కూల్సమస్యల గురించి తెలుసుకున్నారు. స్టూడెంట్స్కు మెనూ ప్రకారం ఆహారం అందించాలని సిబ్బందిని సూచించారు.
అనంతరం రెజ్లింగ్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. స్టూడెంట్స్చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దేవుజా, తహసీల్దార్ రంగారావు, కాలేజ్ఆర్సివో భీమయ్య, ప్రిన్సిపల్ యోగేందర్ లక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, ఎంపీడీవో యాదగిరి, ఎంపీవో హరిశంకర్ పాల్గొన్నారు.