- కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన సమస్యలపై అధికారులు దృష్టిపెట్టాలని కలెక్టర్క్రాంతి ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 43 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి, డీఆర్వో పద్మజారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్: ప్రజావాణి పై నమ్మకంతో వచ్చే ప్రజల సమస్యలను ఓపికతో విని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులకు సూచించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో భూ సంబంధిత, డబుల్ బెడ్ రూమ్స్, ఆసరా పింఛన్లు తదితర సమస్యలపై 74 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్ వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్ టౌన్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జడ్పీ సీఈవో ఎల్లయ్యఅధికారులకు సూచించారు. మెదక్కలెక్టరేట్లో డీఆర్వో భుజంగరావుతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 72 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ధరణి 37, పింఛన్‌కు 4, ఇందిరమ్మ ఇళ్లు 2, ఇతర సమస్యలు 29 ఉన్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు.