
పటాన్చెరు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత, ప్రమాణాలు పాటించాలని కలెక్టర్క్రాంతి సూచించారు. శనివారం ఆమె పటాన్చెరు మండలంలోని రామేశ్వరంబండలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల ద్వారా శిక్షణ పొందిన మహిళా మేస్త్రీలు ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన సిమెంట్ ఇటుకలను ఇండ్ల నిర్మాణంలో వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ చలపతి రావు, తహసీల్దార్ రంగారావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిశీలన
ముత్తంగిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల స్కూల్, కాలేజీలోఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ క్రాంతి పరిశీలించారు. అనంతరం బాలికల గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. స్టూడెంట్స్కోసం వండిన వంటలను చెక్‌చేశారు.