
జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలోని గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్, హస్పిటల్ ను కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హైస్కూల్ కు వెళ్లి స్టూడెంట్లతో మాట్లాడారు. పదో తరగతి స్టూడెంట్లను పలు ప్రశ్నలు అడిగారు.
అనంతరం గవర్నమెంట్ హస్పిటల్ లో నేరుగా రోగులతో మాట్లాడి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. హస్పిటల్ లో రికార్డులను పరిశీలించారు. కిష్టాపూర్ లోని కస్తూర్బా గాంధీ స్కూల్ ను సందర్శించి వంట గదికి వెళ్లి బాలికలకు అందిస్తున్న ఆహరాన్ని పరిశీలించారు. పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని స్కూల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణికి సూచించారు.