నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి :  కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్​లో రివ్యూ  నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు15 వేల మెట్రిక్ టన్నుల సన్నాలు మాత్రమే కొనుగోళ్ల జరిగాయన్నారు. రైతు బీమా పథకం లబ్ధిదారులకు పరిహారం చెల్లించాలన్నారు. రబీ సీజన్​కు అవసరమైన యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. 

చెన్నూర్, జైపూర్ మండలాల్లో సాగులో ఉన్న ఆయిల్ పామ్ తోటల లక్ష్యాలను సాధించాని.. ప్రత్యామ్నాయ, వాణిజ్య, కూరగాయల సాగును ప్రోత్సహించాల న్నారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్​కల్పన, హార్టికల్చర్​అధికారి అనిత, డీఆర్డీవో కిషన్, సివిల్​సప్లయీస్ ​ఆఫీసర్ బ్రహ్మారావు, డీఎం శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.