మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత : కలెక్టర్ ​కుమార్ ​దీపక్

మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత : కలెక్టర్ ​కుమార్ ​దీపక్

కోల్​బెల్ట్​, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సహకారం అందిస్తోందని మంచిర్యాల కలెక్టర్ ​కుమార్ ​దీపక్ అన్నారు. బుధవారం మందమర్రి ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్​ను కలెక్టర్​ ప్రారంభించి మాట్లాడారు.

సర్కార్​అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. క్యాంటీన్​లో నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు విక్రయించాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మందమర్రి తహసీల్దార్​ సతీశ్​కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్​ పాల్గొన్నారు. 
 

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వినతి

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లను కేటాయించాలని కోరుతూ మందమర్రి ప్రెస్​ క్లబ్​ ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్​ నేతృత్వంలో పాత్రికేయులు కలెక్టర్ కుమార్ దీపక్​కు వినతిపత్రం అందజేశారు. ఏళ్లుగా తమ సమస్య పరిష్కారం కావడంలేదని, కాంగ్రెస్​సర్కార్​ జర్నలిస్టులను ఆదుకోవాలని కోరారు.