ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు : రైతులు వ్యవసాయంలో లబ్ధి పొందేలా ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల సాగుపై వారికి అవగాహన కల్పించి, ఆ దిశగా ప్రోత్సహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్​లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన, ఉద్యానవన శాఖ అధికారి అనిత, జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ తో కలిసి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ, పశువైద్య శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. 

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, జిల్లాలో చేపట్టాల్సిన వ్యవసాయ పనులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. సాధారణ పంటలు మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు, కూరగాయల సాగుపై రైతులను ప్రోత్సహించాలని సూచించారు. 

పాడి రైతులు పౌల్ట్రీ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం పై దృష్టి సారించాలని, అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్, పండ్ల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోందని, వ్యవసాయ అధికారులు ప్రభుత్వ పథకాలను రైతులకు వివరించాలని పేర్కొన్నారు. రైతులు మెరుగైన సాగు పద్ధతులు పాటించి లాభాలు గడించేలా చూడాలన్నారు.