బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్ పూర్తి : కుమార్ దీపక్

బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్ పూర్తి : కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ఈ నెల 27న జరగనున్న మెదక్–-నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశామని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్​లోని కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణతో కలిసి ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ర్యాండమైజేషన్ నిర్వహించారు.

 ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల కోసం 48 జంబో బ్యాలెట్ బాక్స్​లు కేటాయించగా అందులో 8 అదనపు బాక్సులు, 48 స్మాల్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఎన్నికల కోసం 44 స్మాల్ బ్యాలెట్ బాక్సులు కేటాయించగా అందులో 8 అదనపు బాక్సులు కేటాయించామన్నారు.  జిల్లాలో 40 పట్టభ ద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల కోసం 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి పంపిణీ చేసి, కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా అధికా రులు, ఏజెంట్లు కృషి చేయాలన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి 

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిచాలని కలెక్టర్ సూచించారు. మంచిర్యాల పట్టణంలోని మాతా-శిశు ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే వారితో మర్యాదగా ఉంటే వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కాలేజ్ రోడ్డులో నిర్మిస్తున్న శ్మశానవాటికను సందర్శించి కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్ఎంవోలు భీష్మ, శ్రీధర్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.