జైపూర్ (భీమారం), వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలున్న ఆహారం అందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. భీమారం మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ ను సందర్శించి వంటగది, ఆహార నిల్వలు, గదులు, పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన సామగ్రి మాత్రమే వాడాలన్నారు.
పరిశుభ్రత పాటిచాలని స్టూడెంట్లకు సూచించారు. తహసీల్దార్ సదానందం, సంబంధిత అధికారులు ఉన్నారు. భీమారం మండల కేంద్రంలో చేపడుతున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం పనులను పనులను పరిశీలించారు. పనులు స్పీడప్ చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. మండలంలోని సుంకరిపల్లి, భీమారం, ఆరెపల్లి, మద్దికల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. సన్నరకం ధాన్యాన్ని ఏఈవోలు గుర్తించి.. రైతులకు ధ్రువపత్రం జారీ చేయాలన్నారు. సన్నరకం, దొడ్డురకం వడ్లను వేర్వేరుగా కొనుగోలు చేయాలని సూచించారు.