నిధులు, ఖర్చుల నివేదికలు ఇవ్వండి : కలెక్టర్ కుమార్ దీపక్

నిధులు, ఖర్చుల నివేదికలు ఇవ్వండి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో బడ్జెట్, నిధుల వినియోగం తదితర అంశాలకు సంబంధించి ఆర్థిక సంవత్సరం ముగింపు ప్రక్రియను పూర్తిచేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యంతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఈఈలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో రివ్యూ నిర్వహించారు.

 జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో కేటాయించిన అభివృద్ధి పనుల నిర్వహణకు మంజూరైన నిధులు, ఖర్చులు, గుత్తేదారులకు కేటాయించిన పనుల వివరాలు,  జీఎస్టీ ఇతర పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలన్నారు. జిల్లాలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, సంబంధిత బిల్లులు సమర్పించాలన్నారు. 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా నిధుల విడుదల, పనుల పురోగతి, ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

టెక్నాలజీ సెంటర్ ద్వారా ఆధునిక విద్య

సాంకేతిక విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అభ్యర్థులకు ఉత్తమ విద్యనందిస్తామని కలెక్టర్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. పోటీ ప్రపంచంలో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించి ఉపాధి పొందేలా అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.