జమ్మికుంట, వెలుగు: నిర్ణీత గడువు లోపు మిల్లర్లు ఎఫ్‌సీఐకి సీఎంఆర్ అందజేయాలని అడిషనల్కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ఎఫ్‌సీఐ గోదాంను అడిషనల్కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదాంలలో నిల్వ ఉన్న రైస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.