ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్లతో కలిసి  కలెక్టర్ భోజనం

ఖమ్మం టౌన్, వెలుగు : ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గురువారం సిటీలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం స్టూడెంట్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

స్కూల్​లో 460 మంది స్టూడెంట్లు ఉన్నారని, టాయిలెట్లను కేవలం బాలికల కోసమే వినియోగిస్తున్నామని హెచ్ఎం శైలజ కలెక్టర్ ​దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ అదనపు టాయిలెట్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్​వెంట డీఈఓ సోమశేఖరశర్మ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్. మాలతి, సీఎంఓ రాజశేఖర్, ఎస్ఎంసీ చైర్మన్ నారాయణరావు ఉన్నారు.