
కోహెడ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో కంప్యూటర్ల్యాబ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్మనుచౌదరి అన్నారు. గురువారం మండలంలోని శనిగరం, కోహెడ హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్స్ఆర్థిక ఇబ్బందులను పక్కన బెట్టి అనుకున్న లక్ష్యంపైనే గురిపెట్టాలన్నారు.
కంప్యూటర్ల్యాబ్లను సద్వినియోగం చేసుకునేలా టీచర్లు కృషి చేయాలన్నారు. ప్రతి రోజు వార్తా పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. టీచర్స్స్టూడెంట్స్ని స్టేజీ మీద మాట్లాడిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. కోహెడ, శనిగరం, అంతక్కపేట స్కూళ్లల్లో రూ.50 లక్షలతో ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు సహకరించిన టీఎస్ఐజీ డైరెక్టర్అర్చన సురేశ్, సేల్స్ఫోర్సెస్సంస్థ ప్రతినిధి మాధురీ కనకాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంఈవో పద్మయ్య ఉన్నారు.