సిద్దిపేట రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను జాగ్రత్తగా, పారదర్శకంగా, పకడ్బందీగా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఇందిరమ్మ కమిటీ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 3వ వార్డు, జిల్లా కేంద్రంలోని 10వ వార్డులో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలను నమోదు చేయాలన్నారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ లు పరిశీలించిన తర్వాతే యాప్ లో అప్ డేట్ చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఎమ్మార్వో సలీం తదితరులు పాల్గొన్నారు.