ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​

రఘునాథపల్లి, వెలుగు: రఘునాథపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి, పేషంట్ల నమోదు, ప్రసవాలు, రక్త పరీక్షల తీరు, ఇతర అంశాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. హీట్ స్ట్రోక్ పై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. 

అంతకు ముందుగా జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బంది పీవోలు, ఏపీవో లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై పలు సూచనలు చేశారు. ఆయనవెంట జనగామ ఆర్డీవో కొమురయ్య, తహసీల్దార్ వెంకన్న, డీఎంహెచ్ వో హరీశ్​ రాజ్, డాక్టర్ మహేందర్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కమలహాసన్, డాక్టర్ సుల్తానా రజియా, వైద్య సిబ్బంది బిక్కు నాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, పాండరి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

సీహెచ్​సీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​
 

పరకాల, వెలుగు: హన్మకొండ జిల్లా పరకాలలోని కమ్యూనిటీ హెల్త్​సెంటర్​(సీహెచ్​సీ)ని కలెక్టర్​సిక్తా పట్నాయక్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ సేవలను గురించి ఆరా తీశారు. వేసవి దృష్ట్యా ఆసుపత్రిలో ఓఆర్​ఎస్ ప్యాకెట్లు, మందులను సరిపోను నిల్వ ఉంచాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం స్కూల్​ను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో స్కూళ్లలో మౌళిక వసతులు కల్పించాలని చెప్పారు. పాలిటెక్నిక్​కళాశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణను పరిశీలించారు. కలెక్టర్​ వెంట ఆర్డీవో నారాయణ, తహసీల్దార్​ భాస్కర్, కమిషనర్​నర్సింగం ఉన్నారు.