పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ మనుచౌదరి

పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, ఎలక్షన్​కమిషన్​ఆదేశాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో డీపీవో దేవకీదేవి, ఈ డిస్టిక్ మేనేజర్ ఆనంద్, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ  మొదటి, రెండో విడత ఎన్నికల పోలింగ్ కు మండలాల వారీగా మొదటి విడత ర్యాండమైజేషన్  నిర్వహించి అధికారులను కేటాయించారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ..ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి, జిల్లా పంచాయతీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

హైవే పనులను స్పీడప్​చేయాలి..

నేషనల్ హైవే పనులను స్పీడప్​చేయాలని కలెక్టర్ మను చౌదరి నేషనల్ హైవే అధికారులను, కాంట్రాక్టర్ ని ఆదేశించారు. కలెక్టరేట్ లో నేషనల్ హైవే ఇంజనీర్, కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎల్కతుర్తి నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా  సిద్దిపేట నుంచి జిల్లా పరిధి చివరి ప్రాంతం వరకు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్ టౌన్ లో వాటర్ పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్ పనులు పుర్తి చేసి జంక్షన్ డెవలప్ మెంట్ పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నేషనల్ హైవే ఏఈ లు అనురాగ్, శ్రీనివాస రావు, కాంట్రాక్టర్ చందు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించాలి

ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ పత్రాలు అందుకున్న వారిచే ఇండ్ల పనులను వెంటనే  ప్రారంభించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఎంపీడీవో, పంచాయతీ రాజ్, ఆర్అండ్ బీ ఇంజనీర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ మ్యాప్ ను చూపించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ దామోదర రావు, డీఎంహెచ్​వో పల్వన్ కుమార్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ చిరంజీవులు పాల్గొన్నారు.