అభివృద్ధి పనులను స్పీడప్​ చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

అభివృద్ధి పనులను స్పీడప్​ చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట టౌన్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను స్పీడప్​ చేసి మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో పంచాయతీ రాజ్, డీఆర్డీఏ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ,  గ్రామ పంచాయతీ భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మట్టిరోడ్డుతో  ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ  శ్రీనివాస్ రెడ్డి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు