
సిద్దిపేట, వెలుగు: హాస్టల్ స్టూడెంట్స్కు క్వాలిటీ భోజనం పెట్టాలని కలెక్టర్మనుచౌదరి సూచించారు. శనివారం రాత్రి ఆయన సిద్దిపేటలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగాతనిఖీ చేశారు. వంటగది, స్టోర్ రూంలను పరిశీంచారు. కొత్త మెనూ ప్రకారం స్టూడెంట్స్కు శుభ్రమైన ఆహారం పెట్టాలన్నారు. సరుకుల ఎక్స్పైరీ డేట్ చూసి వినియోగించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అనంతరం పదో తరగతి స్టూడెంట్స్తో కాసేపు మాట్లాడారు. అన్ని సబ్జెక్ట్ లపై పట్టు సాధించి, పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ నాగలతకు సూచించారు.